- వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్, వెలుగు : సీజనల్ వ్యాధుల దృష్ట్యా జిల్లా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో సోమవారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. డెంగీ, మలేరియా రాకుండా నిరోధించేందుకు నీటి నిల్వలు లేకుండా చూడాలని స్పష్టంచేశారు.
నీటి నిల్వ ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ బాల్స్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ సుధీర్, వైద్య, ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ అమర్ సింగ్ నాయక్, డీఎంహెచ్ వో పాల్వన్ కుమార్, డీఈవో రేణుకాదేవి, ఎస్సీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు పాల్గొన్నారు.