కొడంగల్, వెలుగు : విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వికారాబాద్కలెక్టర్ ప్రతీక్జైన్అన్నారు. కొడంగల్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులంలో రూ. 23.45 కోట్లతో అదనపు గదుల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డితో కలిసి గురువారం కలెక్టర్ భూమిపూజ చేశారు. అలాగే దుద్యాల మండల కేంద్రంలో సమీకృత భవన నిర్మాణం, పాఠశాల, ఐటీఐ, జూనియర్ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
దుద్యాలలో పోలీస్ స్టేషన్, పీహెచ్‌సీని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో మాట్లాడి కొత్తగా అమలు చేస్తున్న మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.