
పరిగి, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్ జైన్ వైద్యాధికారులకు సూచించారు. గురువారం పూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి తో కలసి తనిఖీ చేశారు. ఇన్ పేషెంట్, లాబరేటరీ, మందుల నిల్వ గదితో పాటు ఔట్ పేషెంట్, ఏఎంసీ రిజిష్టర్లను పరిశీలించారు.
ఆస్పత్రిలో రిపేర్ పనులు చేపట్టి, వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం వివిధ పరీక్షలు, గర్భిణీలకు అందిస్తున్న వైద్య సేవలు, ప్రసవాల వివరాలపై ఆయన ఆరా తీశారు. కలెక్టర్‌తో పాటు తహసీల్దార్ భరత్ గౌడ్, డాక్టర్ దేవికా రెడ్డితో పాటు ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు.