జగదీశ్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలి : సుధాకర్ రెడ్డి

జగదీశ్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలి : సుధాకర్ రెడ్డి
  • వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి 

వికారాబాద్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని వికారాబాద్​పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి డిమాండ్​చేశారు. శుక్రవారం వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్ చౌరస్తా లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  స్పీకర్‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళితుడు స్పీకర్ అయినందుకే ఓర్వలేకపోతున్నారని కేసీఆర్ నిరంకుశత్వానికి గురువారం అసెంబ్లీలో జరిగిన సంఘటన నిదర్శనమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ పార్టీ సీనియర్​నాయకులు వి.సత్యనారాయణ, జె. రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.