వికారాబాద్ జిల్లా దారూర్ ఎస్సై రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.. రూ.30 వేల లంచం తీసుకుంటూ..

వికారాబాద్ జిల్లా దారూర్ ఎస్సై రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.. రూ.30 వేల లంచం తీసుకుంటూ..

అవినీతిని రూపు మాపాల్సిన పోలీసులే లంచం తీసుకుంటూ పట్టబడటం ఆందోళన కలిగిస్తోంది. ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకుంటున్నప్పటికీ.. ప్రభుత్వ అధికారులు, కొంత మంది పోలీసులలో మార్పు రావడం లేదు. తాజాగా ఒక వ్యక్తిని ఒక కేసు నుంచి తప్పిస్తానని చెప్పి లంచం తీసుకుంటూ ఎస్సై పట్టుబడిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వికారాబాద్ జిల్లాలోని దారూర్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. దారుర్ మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన వ్యక్తిని ఓ కేసు నుండి తప్పించేందుకు లంచం తీసుకున్నాడు. 

నాగ సముందర్ గ్రామానికి చెందిన వ్యక్తిని కేసు నుంచి తప్పిస్తానని అందుకోసం మొదట70 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఎస్సై. తన వద్ద అన్ని డబ్బులు లేవని 30 వేల రూపాయలు ఇవ్వగలనని చెప్పడంతో అందుకు అంగీకరించాడు. ఒప్పందం ప్రకారం సదరు వ్యక్తి నుంచి రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

ణుగోపాల్ గౌడ్ గతంలో తాండూర్ పట్టణ ఎస్సైగా విధులు నిర్వహించాడు. ఆ తర్వాత దారూర్ మండల ఎస్సైగా బదిలీ అయ్యాడు.