మాలల సింహ గర్జనను సక్సెస్ చేయాలి: వికారాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు బ్యాగరి వెంకటేశ్

వికారాబాద్, వెలుగు: హైదరాబాద్​ జింఖానా గ్రౌండ్​లో డిసెంబర్ 1న జరిగే మాలల సింహ గర్జనను సక్సెస్ చేయాలని వికారాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు బ్యాగరి వెంకటేశ్ కోరారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు సభకు సంబంధించిన వాల్​ పోస్టర్​ను గురువారం విడుదల చేశారు. మాలల ఆత్మగౌరవం, హక్కుల కోసం లక్షలాది మందితో సభను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అధిక సంఖ్యలో మాలలు సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అనంత రాములు, రాములు, ఎంకే పల్లి శ్రీనివాస్, రాజు, రత్నం, వసంత్ కుమార్, అంజిలయ్య, రాజేందర్, యాదయ్య, శివశంకర్ పాల్గొన్నారు.