69 సెంటర్లలో పదో తరగతి పరీక్షలు

69 సెంటర్లలో పదో తరగతి పరీక్షలు
  • వికారాబాద్​జిల్లాలో ఎగ్జామ్స్​రాయనున్న 12,903 స్టూడెంట్లు
  • వివరాలు వెల్లడించిన కలెక్టర్.. అధికారులకు దిశానిర్దేశం

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​జిల్లాలో 12,903 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని కలెక్టర్​ప్రతీక్​జైన్ తెలిపారు. వీరిలో 6,450 మంది బాలురు, 6,453 మంది బాలికలు ఉన్నారన్నారు. మొత్తం 69 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

 ఈ నెల 21న మొదలైన ఏప్రిల్​3న పరీక్షలు ముగుస్తాయని, అప్పటివరకు పరీక్షల కోసం నియమించిన సిబ్బందికి సెలవులు ఉండవన్నారు. ప్రతిరోజు ఉదయం 9:30కు ఎగ్జామ్​మొదలవుతుందని, ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా స్టూడెంట్లను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించాలని స్పష్టం చేశారు. ఎగ్జామ్​సెంటర్​లోని ఏ ఒక్కరి దగ్గరా మొబైల్​ఫోన్​ఉండకూడదని, ఏఎన్ఎంల దగ్గర కూడా మొబైల్ ఉండడానికి వీలు లేదన్నారు. సందేహాల కోసం కంట్రోల్​రూమ్​08416 235245కు కాల్ చేయొచ్చని తెలిపారు. 

రంగారెడ్డి జిల్లాలో 249 సెంటర్లు.. 

రంగారెడ్డి కలెక్టరేట్: రంగారెడ్డి జిల్లాలో ఈసారి 51,766 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. 249 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం కలెక్టరేట్​నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. సెంటర్లలో ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బుధ, గురువారాల్లో సెంటర్లను తనిఖీ చేయాలని ఆదేశించారు.