వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లాలో జడ్పీ చైర్పర్సన్ సునీతా రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరిది. ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అంగీలు చింపుకొని.. కొట్టుకున్నారు. ఈ ఘటనలో సునీతా రెడ్డి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. మర్పల్లిలో సాయిబాబా టెంపుల్ దగ్గర జరుగుతున్న గురు పౌర్ణమి ఉత్సవాలకు జడ్జీ చైర్పర్సన్ సునీతా రెడ్డి వచ్చారు. ఎమ్మెల్యే ఆనంద్ వర్గీయులు ఆమె కారును అడ్డుకుని రాళ్ల దాడికి దిగారు. దీంతో సునీతా రెడ్డి వర్గం అడ్డుకుని.. ఆమెను సురక్షితంగా పూజా కార్యక్రమాలకు తీసుకెళ్లింది. మహేందర్ రెడ్డి డౌన్.. డౌన్.., సునీతా రెడ్డి గో బ్యాక్ అంటూ 30 మంది కార్యకర్తలు నిరసన తెలిపారు. మర్పల్లి గడ్డ.. ఎమ్మెల్యే ఆనంద్ అడ్డా.. అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఆనంద్‌ను అవమానించేలా ప్రవర్తిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉంటూ ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. సునీతా రెడ్డి కారుపై బండ రాయి వేయడంతో వెనుక గ్లాస్ పగిలిపోయింది. దాడికి పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డికి జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు.
అంగీలు చింపుకొని కొట్టుకున్న కార్యకర్తలు
- తెలంగాణం
- July 14, 2022
లేటెస్ట్
- ఫ్యాన్సీ నంబర్లకు లక్షలు కుమ్మరింత
- పండ్లు, కూరగాయలను అలాగే తినాలి.. జ్యూస్‌లు చేసి తాగొద్దు..
- అంగన్ వాడీ ఆయాల ఆనందం.. టెన్త్‌తోనే ప్రమోషన్లకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం
- ఆ రాయల్ఫ్యామిలీకి అర్బన్ నక్సల్స్ముచ్చట్లు ఇష్టం: ప్రధాని మోదీ
- మంచిర్యాల జిల్లాలో మళ్లీ పులి కలకలం
- హైదరాబాద్‌లో 45 రోజుల్లో 1,190 ఫోన్లు రికవరీ
- వసంత పంచమికి బాసరలో ఇబ్బందులు రావొద్దు: నిర్మల్ కలెక్టర్ ఆదేశాలు
- జీడీపీ వృద్ది అంచనా.. స్టాక్ మార్కెట్లకు జోష్
- మిర్చి ఏరకుండా వదిలేస్తున్నరు !
- రోడ్లపై నిర్మాణ వ్యర్థాలు డంపింగ్..762 మందికి రూ.42 లక్షల ఫైన్లు
Most Read News
- బాబా వంగా జ్యోతిష్యం : ఈ 4 రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..
- సర్కార్ కు సలాం : రూ.30 లక్షలు సంపాదిస్తే..17 లక్షలు పన్ను ఏంటీ.. పన్నులు కట్టటానికే బతుకుతున్నామా..!
- Aha Thriller: ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చిన తెలుగు సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్టోరీ ఏంటంటే?
- రోజుకు రూ.10 లక్షలు లిమిట్.. ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్
- టెంపరరీ లైటింగ్ కోసం రూ.500 కోట్లా?
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- అప్పులు చేసి అపార్ట్ మెంట్ కట్టాడు.. ప్లాట్లు అమ్ముడుపోక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
- Prabhas Imanvi: ప్రభాస్ ఇంటి భోజనానికి 'ఫౌజీ' హీరోయిన్ ఫిదా.. వీడియో పోస్ట్ చేస్తూ స్పెషల్ థ్యాంక్స్
- ఫలిస్తున్న ఆపరేషన్ ఆడదూడ!..పెరుగుతున్న పశుసంపద
- Meenakshi Chaudhary: శ్రీశైలంలో మీనాక్షి చౌదరి.. స్వామి సేవలో హీరోయిన్