దివ్యాంగ విద్యార్థులు స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోండి

  •     వికారాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి

వికారాబాద్, వెలుగు :  జిల్లాలోని దివ్యాంగుల విద్యార్థులు 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్  ఫ్రెష్, రెన్యువల్ కు అప్లై చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కీమ్ లో భాగంగా నేషనల్ స్కాలర్ షిప్ కింద ఆన్ లైన్ పోర్టల్ లో మాత్రమే అప్లై చేసుకోవాలని సూచించారు. పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ కు 9, 10, క్లాసులు, ఇంటర్ ఫస్ట్ , సెకండ్ ఇయర్ విద్యార్థులు, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ కు డిగ్రీ, పీజీ, డిప్లొమో చదివే విద్యార్థులు అర్హులని వివరించారు. వచ్చే అక్టోబర్ 31వ తేదీ లోపు అప్లై చేసుకుని దివ్యాంగ విద్యార్థులు స్కాలర్ షిప్ స్కీమ్  సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కోరారు.