- దాడి చేసినవాళ్లలో మరో 18 మంది కూడా భూమి కోల్పోతలేరు
- కొందరికి అసలు అక్కడ స్థలమే లేదు.. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్‌ను పిలిచి అటాక్ చేశారు
- దాడి చేయడం కరెక్ట్ కాదని గ్రామస్తులు అడ్డుకున్నారు
- హైదరాబాద్ మల్టీ జోన్ -2 ఐజీ సత్యనారాయణ వెల్లడి
వికారాబాద్, వెలుగు: లగచర్ల ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త భోగమోని సురేశ్రాజుతోపాటు మరో 18 మందికి భూసేకరణలో భూమి పోవడం లేదని.. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్‌ను, అధికారులను గ్రామానికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారని హైదరాబాద్మల్టీ జోన్---2 ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. ‘‘లగచర్ల దాడిలో మేం గుర్తించిన 47 మందిలో 19 మంది భూసేకరణలో ల్యాండ్ కోల్పోవడం లేదు. ఇందులో కొందరికి అక్కడ భూమి కూడా లేదు. ఒక వేళ వారికి ఒకటీ రెండు ఎకరాలు ఉన్నా కూడా వారు ల్యాండ్ అక్విజేషన్‌లో కోల్పోవడం లేదు. దాడికి రూపకల్పన చేసిన సురేశ్రాజుతో పాటు అతడి బ్రదర్ మహేశ్ భూమి కూడా భూసేకరణలో పోతలేదు” అని ఐజీ వివరించారు.
ఇప్పటి వరకు 21 మందిని రిమాండ్ చేశామని.. ఇందులో మంగళవారం16 మందిని, బుధవారం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు దాడిలో పాలుపంచుకున్న విశాల్, మహేశ్, రమేశ్, సాయిలును రిమాండ్ చేసినట్లు వెల్లడించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ఆవరణలో ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి ఐజీ మాట్లాడారు. కలెక్టర్, ఇతర అధికారులను మభ్యపెట్టి ఉద్దేశపూర్వకంగా గ్రామంలోకి తీసుకువెళ్లి దాడి చేశారని తెలిపారు. దాడి చేస్తుంటే గ్రామస్తులు నిలువరించారని, దాడి చేయడం కరెక్ట్ కాదని అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ‘‘లగచర్ల ఘటనలో వీడియోలు, ఫొటోలు, ప్రత్యక్ష సాక్షుల ద్వారా 47 మందిని గుర్తించాం. ఇంకా చాలా మంది ఐడెంటిఫై కావాల్సి ఉంది. 47 మందిలో 19 మందికి ల్యాండ్ఆక్విజేషన్తో సంబంధం లేదు. సురేశ్ రాజ్, మహేశ్ భూమి పోవడం లేదు. 19 మందిలో ఒకటి, రెండు ఎకరాలున్న వాళ్లు కొంతమంది ఉన్నా వారి భూమి కూడా పోవడం లేదు. అసలు నోటిఫికేషన్ లో లేనివాళ్లు కూడా దాడికి వచ్చారు” అని వెల్లడించారు.
ఓ రేప్ కేసులో సురేశ్ ఉన్నడు
కలెక్టర్ ను మిస్ లీడ్ చేసి లగచర్లకు తీసుకువెళ్లిన సురేశ్‌పై చదువుతున్నప్పుడే ఏదో రేప్‌కేసులో ఉన్నాడని, ఆ కేసును మ్యానేజ్ చేసినట్లు తెలిసిందని ఐజీ సత్యనారాయణ అన్నారు. వెరిఫై చేస్తున్నామని చెప్పారు. పట్నం నరేందర్ రెడ్డిని టెక్నకిల్ఎవిడెన్స్తో అరెస్టు చేశామన్నారు. మంగళవారం వరకు ఏ1గా భోగమోని సురేశ్ఉన్నాడని, పట్నం నరేందర్‌రెడ్డి ఆదేశాల మేరకే సురేశ్దాడికి ప్లాన్ చేసినట్లు విచారణ తర్వాత తేలడంతో ఏ1గా నరేందర్ రెడ్డిని, ఏ2గా సురేశ్‌ను మార్చామని తెలిపారు. సురేశ్ రాజు, దేవదాస్, గోపాల్ నాయక్, విజయ్, విఠల్ పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. మొత్తం మూడు కేసులతో పాటు మరో కిడ్నాప్ కేసు నమోదు చేశామని, త్వరలోనే అందరినీ పట్టుకుంటామన్నారు.