పోలీసు శాఖకు పేరు తెచ్చేలా డ్యూటీ చేయండి : నారాయణరెడ్డి

పోలీసు  శాఖకు  పేరు తెచ్చేలా డ్యూటీ చేయండి : నారాయణరెడ్డి

వికారాబాద్, వెలుగు:  శిక్షణ పూర్తయిన తర్వాత పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చేలా డ్యూటీ చేయాలని ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా శిక్షణ కేంద్రంలో ట్రైనీ కాని స్టేబుళ్ల ఇంట్రరాక్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొ ని మాట్లాడారు. వికారాబాద్ డీటీసీలో శిక్షణ పొందటం చాలా అదృష్టమన్నారు. ట్రైనీ కానిస్టేబుళ్లలో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన వారు ఉన్నారన్నారు. ప్రతి రోజు ఏదో ఒక మంచి విషయం నేర్చుకోవాలని, ఎవరు కూడా చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.  

శిక్షణలో యోగ, మెడిటేషన్, వ్యాయామాలను అనంతరం కూడా కొనసాగించాలని పేర్కొన్నారు. జులై 1 నుంచి మారుతున్న చట్టాలపైన, సైబర్ నేరాలు, ఫైనాన్సియల్ ఫ్రాడ్స్ పైన కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం డీటీసీలోని క్లాస్ రూమ్ లు, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, బ్యారక్ లను, కిచెన్ రూమ్ లను పరిశీలించారు.  డీటీసీ ప్రిన్సిపాల్  మురళీధర్, డీటీసీ డీఎస్పీ విజయ్ కుమార్, ఏఆర్ డీఎస్పీ వీరేశ్, డీటీసీ ఇన్ స్పెక్టర్ వెంకట్రామ్, పీసీఆర్ ఇన్ స్పెక్టర్ ప్రమీల, ఆర్ఐ నాగరాజు, సిబ్బంది  ఉన్నారు.