ఓటమి నుంచి కోలుకోక ముందే.. బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి పార్టీకి భారత రాష్ట్ర సమితి.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. లేఖను పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కు పంపించారు. పార్టీకి రాజీనామా చేయటంతోపాటు.. పార్టీ సభ్యత్వాన్ని వదులకుంటున్నట్లు లేఖలో వెల్లడించారామె.
ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీ అందించిన సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలియజేశారామె. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సునీతా మహేందర్ రెడ్డి.. అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తన కుమారుడు పట్నం రినీష్ రెడ్డితోపాటు ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు.
Also read : రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్