హైదరాబాద్, వెలుగు:- కిచెన్ సామాన్లను అమ్మే బెర్గ్నర్ ఇండియా, తన ప్రచారకర్త చెఫ్ వికాస్ ఖన్నాతో కలిసి హైదరాబాద్లో సరికొత్త శ్రేణి కిచెన్ వేర్ను లాంచ్ చేసింది. ట్రై ప్లై బిర్యాని పాట్, కడాయి, ఫ్రై పాన్ వంటివి తాజాగా మార్కెట్లోకి తెచ్చింది.
వీటిని ట్రెడిషనల్ స్టైల్లో డిజైన్ చేసింది. ‘ఆరోగ్యకరమైన, మరింత సమర్థవంతమైన వంట పద్ధతులను ప్రోత్సహించే మా మిషన్లో భాగంగా పాపులర్ చెఫ్ వికాస్ ఖన్నాతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషిస్తున్నాం’ అని బెర్గ్నర్ ఇండియా ఎండీ, సీఈఓ ఉమేష్ గుప్తా అన్నారు.