వేములవాడ, వెలుగు: బీఆర్ఎస్‌కు తొమ్మిదన్నర ఏండ్లు అవకాశం ఇచ్చినా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని వేములవాడ బీజేపీ అభ్యర్థి డాక్టర్ చెన్నమనేని వికాస్‌రావు విమర్శించారు. గురువారం చందుర్తి, రుద్రంగి మండల కేంద్రాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం నేతలు అమలు చేయలేని హామీలు ఇచ్చి మోసం చేసేందుకు వస్తుంటారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
వేములవాడలో ఈసారి బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. తనకు అవకాశం ఇస్తే మండలానికి ఒక నైపుణ్య కేంద్రం ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇప్పిస్తానని, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని టెంపుల్ సిటీగా, పర్యాటక కేంద్రంగా మార్చడానికి కేంద్ర నిధులు తీసుకురానున్నట్లు తెలిపారు. అంతకుముందు మాజీ కౌన్సిలర్ రాపెల్లి లావణ్య శ్రీధర్ బీజేపీలో చేరారు. ప్రచారంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, లీడర్లు వెంకటేశ్, శ్రీనివాస్, సత్తయ్య, మల్లికార్జున్తదితరులు పాల్గొన్నారు.