మోదీ సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకెళ్లాలి : చెన్నమనేని వికాస్​

కథలాపూర్,వెలుగు : ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని బీజేపీ లీడర్​ డాక్టర్ చెన్నమనేని వికాస్​ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కథలాపూర్​ మండల కేంద్రంతో పాటు దుంపేట, దూలూరు, బొమ్మెన , ఇప్పపెల్లి, పోతారం గ్రామాల్లో వికాస్​ పర్యటించారు. బొమ్మెన లో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.3 లక్షల విలువ చేసే వైకుంఠ రథాన్ని అందించారు. కథలాపూర్, దుంపేట , పోతారం లో బాధిత కుటుంబాలను పరామర్శించారు.

అనంతరం పలువురు బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ లీడర్లు కంటే సత్యనారాయణ, ఎడ్మల వినోద్ రెడ్డి, బండ అంజయ్య, గాంధారి శ్రీనివాస్, బద్రి సత్యం, వెంకటేశ్వరరావు బండ అంజయ్య,మల్యాల మారుతి పాల్గొన్నారు.