ముగిసిన వికసిత్​ భారత్​ నేషనల్​సెమినార్​

ముగిసిన వికసిత్​ భారత్​ నేషనల్​సెమినార్​

ముషీరాబాద్, వెలుగు: దేశంలో హ్యూమన్​రిసోర్స్​పెంచుకోవాల్సిన అవసరం ఉందని, పెరుగుతున్న జనాభా సమస్య కాదని ప్రొఫెసర్ నరసయ్య అన్నారు. సంచార పాఠశాలలు ఏర్పాటు చేసి గ్రామాల్లో అక్షరాస్యత పెంచాలని పేర్కొన్నారు. బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విద్యాసంస్థల్లో ‘వికసిత్ భారత్–2047’ అంశంపై రెండు రోజులపాటు కొనసాగిన నేషనల్​సెమినార్​శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం, ప్రొఫెసర్ పి.నరసయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ గౌడ్, రాజారాం, విద్యాసంస్థల జాయింట్ సెక్రటరీ పీవీ రమణ కుమార్ హాజరై మాట్లాడారు. 

వికసిత్ భారత్ కు రైతులు, యువత, మహిళలు, జనాభా మూల స్తంభాలన్నారు. వ్యవసాయ రంగంలో మార్పులు రావాల్సి ఉందని, వారికి ఆర్థిక సహకారం పెరగాలని అభిప్రాయపడ్డారు. నేటికీ చైనా వంటి దేశాలకు వలసలు కొనసాగుతున్నాయని, ఎలక్ట్రానిక్ వస్తువులు, పెట్రోలు, బంగారం దిగుమతి చేసుకుంటూనే ఉన్నామని చెప్పారు. ప్రతిఒక్కరూ ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో విద్య పాత్ర, మహిళా సాధికారత, ఇండస్ట్రీస్, ఉన్నత విద్యలో నైపుణ్యాలు వంటి అంశాలపై విస్తృతమైన పత్ర సమర్పణ జరగాలని సూచించారు.

 వీటిపై యువత అవగాహన పెంపొందించుకోవాలని, స్టాక్ మార్కెట్ ఎలా మార్పు చెందుతుందో తెలుసుకొని ముందుకు నడవాలని సూసించారు. అనంతరం ప్రజెంటేషన్ ఇచ్చిన విద్యార్థులను అభినందించి బహుమతులను అందజేశారు. డైరెక్టర్ విష్ణుప్రియ, ప్రిన్సిపాల్ మట్ట శేఖర్, డాక్టర్ వెంకటరమణ, మధుకర్, నవ్య, డాక్టర్ శ్రీధర్ తోపాటు ఇతర కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.