- రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు
- శాతావహన వర్సిటీలో ముగిసిన ‘వికసిత్ భారత్’ సదస్సు
కరీంనగర్, వెలుగు : స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం అనేక విజయాలు సాధించిందని రిటైర్డ్ ఐఏఎస్, శాతావాహన వర్సిటీ మాజీ వీసీ టి.చిరంజీవులు అన్నారు. ‘వికసిత్ భారత్ @ 2047 – ఇండియా విజన్ ఫర్ డెవలప్‌మెంట్’ అనే అంశంపై శాతావాహన యూనివర్సిటీలో రెండు రోజులుగా నిర్వహించిన జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి చిరంజీవులుతో పాటు ఐసీఎస్ ఎస్ఆర్ సదరన్ రీజియన్ డైరెక్టర్ బి.సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవులు మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యాలను సమర్థవంతంగా అమలుచేస్తే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందన్నారు. రెండు రోజుల సదస్సులో 50 మంది ప్రొఫెసర్లు, లెక్చరర్లు, రీసెర్చ్ స్కాలర్స్ తమ పరిశోధనాపత్రాలు సమర్పించి చర్చల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ ఉమేశ్‌కుమార్, సెమినార్ డైరెక్టర్, ఎకనామిక్స్ హెచ్‌వోడీ శ్రీవాణి, రిజిస్ట్రార్ రవికుమార్ జాస్తి, వీసీ ఓఎస్‌డీ డి.హరికాంత్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సూరేపల్లి సుజాత, మాజీ రిజిస్ట్రార్ ఎం.వరప్రసాద్, ఉమెన్ సెల్ డైరెక్టర్ కె.పద్మావతి పాల్గొన్నారు.