యాదాద్రి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్‌‌పై ప్రచార యాత్ర

యాదాద్రి, వెలుగు:  కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్‌‌పై చేపట్టిన వికసిత భారత్​ సంకల్ప యాత్ర శనివారం యాదాద్రి జిల్లాలోని ముత్తిరెడ్డి గూడెంలో ప్రారంభమైంది. ఈ యాత్రను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్​ పద్ధతిలో ప్రారంభించి మాట్లాడారు.  దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్​ బస్సులు, మెట్రో సర్వీసులు, ఉజ్వల గ్యాస్​ కనెక్షన్లు, ఉపాధి హామీ వంటి స్కీమ్స్​తో పాటు వన్​ నేషన్​- వన్​ రేషన్​ కార్డు, ఆయుష్మాన్​ భవ కార్డుల​ గురించి వివరించారు.

తొమ్మిదేండ్లలో 4 కోట్ల ఇండ్లను నిర్మించి పేదలకు ఇచ్చామని వెల్లడించారు. 12 డిపార్ట్​మెంట్ల ద్వారా కేంద్రం అమలు చేసిన స్కీమ్స్​ గురించి ఎల్​ఈడీ స్క్రీన్ అమర్చిన మోదీ గ్యారంటీ వెహికల్​నుంచి ప్రదర్శించారు.  అనంతరం మహిళలకు బుక్​లెట్లు, కరపత్రాలు అందించారు. నోడల్​ ఆఫీసర్​ శ్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ  శ్యాంసుందర్​రావు, కాసం వెంకటేశ్వర్లు, దాసరి మల్లేశం, వేముల అశోక్​, పడాల  శ్రీనివాస్​, పిట్టల అశోక్​, చందా మహేందర్​ గుప్తా పాల్గొన్నారు.