34YearsOfCHIYAANism: ఐకానిక్ టాలెంట్ చియాన్ సినీ స్పెషల్.. 34 ఏళ్ల వైవిధ్య ప్రయాణం

34YearsOfCHIYAANism: ఐకానిక్ టాలెంట్ చియాన్ సినీ స్పెషల్.. 34 ఏళ్ల వైవిధ్య ప్రయాణం

వైవిధ్యమైన పాత్రలతో సినిమాలు చేసే అతి కొద్ది మంది హీరోల్లో కమల్ హాసన్ తర్వాత చియాన్ విక్రమ్ (Chiyyan Vikram) పేరు గుర్తుకు వస్తుంది. ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ ఉంటారు. ఆయన ఎంచుకునే సినిమాలతో పాటు.. అందుకు తగ్గట్లు తన లుక్స్‭ను మార్చుకుంటూ ఉంటారు.

సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా విక్రమ్ రేంజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలో తన లుక్ కోసమే ఎక్కువ కసరత్తు చేస్తుంటాడు. తన పాత్రకు జీవం పోయడానికి ఎంతటి రిస్క్‌ అయినా చేస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అతని సినిమా కెరీర్లో 60 కి పైగా చిత్రాలలో నటించి.. ప్రతి సినిమాతో మెప్పించే విక్రమ్ సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చి (17 October 2024) నేటితో 34 ఏళ్లు పూర్తికావడంతో ఆయన ఫ్యాన్స్, సెలబ్రిటీస్ సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెష్ తెలియజేస్తున్నారు.

ఇక విక్రమ్ తమిళంలో వచ్చిన 'ఎన్ కాదల్ కన్మణి' (17 October 1990)తో సినీ అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత డైరెక్టర్ బాలా తెరకెక్కించిన సేతు (1999)లో ప్రేమికుడి పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందాడు. తెలుగులో విక్రమ్ మొదటి సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం. ఇందులో రాజేంద్రప్రసాద్ స్నేహితుడి పాత్రలో నటించాడు విక్రమ్.

ఇక విక్రమ్ నటించిన తెలుగు సినిమాలు చూసుకుంటే.. అక్కా బాగున్నావా (1996), 9 నెలలు (2000), శివపుత్రుడు (2003), అపరిచితుడు, రావణ్, నాన్న, తాండవం, మల్లన్న, మహాన్, కోబ్రా, ధ్రువ నక్షత్రం, ఐ, తంగలాన్ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు నట ఐకాన్ గా నిలిచాడు. తెలుగు సినిమా శివపుత్రుడు తమిళ మూలమైన పితామగన్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఇప్పటికీ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 60 కి పైగా చిత్రాలలో నటించిన చియాన్ కు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు.

చియాన్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. "పోరాటం యొక్క మట్టి నుండి పైకి లేచిన ఫీనిక్స్ అతను.. ప్రతి సంవత్సరం ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంటాడు. అతనిలో ఎప్పటికీ వదలని వైఖరి, తనపై తనకు ఉన్న అచంచలమైన విశ్వాసం, అతన్ని కోలీవుడ్‌లో ఒక ఐకానిక్ లెజెండ్‌గా మార్చాయి !! చియాన్ విక్రమ్.. ఆల్వేస్ నంబర్ వన్ స్టార్!".

ప్రస్తుతం చియాన్ విక్రమ్.. ‘వీర ధీర శూరన్’(Veera Dheera Sooran) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌(S.U. Arun Kumar) డైరెక్షన్ లో విక్రమ్‌ చేస్తున్న ఈ 62కె సినిమాలో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. .ఈ సినిమాలో హీరో పేరు కాళి,అతనికి ఓ కిరాణా షాప్ ఉంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ విజువల్స్ చూస్తుంటే..ఏదో బలమైన కథాంశంతో సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.