ప్రయోగాత్మక చిత్రాలతో తమిళంతో పాటు తెలుగులోనూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విక్రమ్... ప్రస్తుతం ‘తంగలాన్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలో నటిస్తున్నాడు. పా.రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ అంచనాలు పెంచాయి. సోమవారం విక్రమ్ బర్త్‌డే సందర్భంగా మేకింగ్ వీడియోతో పాటు కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్‌డ్రాప్‌లో.. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు వీడియో బట్టి తెలుస్తోంది.
విక్రమ్ మరో సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. విక్రమ్‌కి ఇది 61వ చిత్రం. పార్వతి, మాళవిక మోహనన్ హీరోయిన్స్. కీలక పాత్రలో హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్లాగిరోన్ కనిపించనున్నాడు. ఇతర పాత్రల్లో పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై, ప్రీతికరణ్ నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తమిళంతోపాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.