కమల్ హాసన్ ‘విక్రమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

కమల్ హాసన్ ‘విక్రమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

చెన్నై: యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ‘విక్రమ్’. కమల్ తోపాటు ప్రముఖ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ యాక్ట్ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఎప్పుడు విడుదలవుతందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ సినిమా రిలీజ్ గురించి అప్ డేట్ ఇచ్చింది. ‘ఖైదీ’, ‘మాస్టర్’ చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘విక్రమ్’ జూన్ 3న విడుదల కానుంది. ఈ మేరకు సినిమా మేకింగ్ వీడియోను కమల్ హాసన్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. విక్రమ్ విడుదల కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నానని.. జూన్ 3న థియేటర్లలో కలుసుకుందాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

ఉబర్​ ఇండియా సీఈవో @ క్యాబ్ డ్రైవర్

నెట్ లేకున్నా.. మిస్డ్​కాల్​తో పేమెంట్స్