Thangalaan OTT: నాలుగు నెలల నిరీక్షణకు తెర.. ఓటీటీలోకి వచ్చేసిన తంగలాన్.. ఎక్కడ చూడాలంటే?

Thangalaan OTT: నాలుగు నెలల నిరీక్షణకు తెర.. ఓటీటీలోకి వచ్చేసిన తంగలాన్.. ఎక్కడ చూడాలంటే?

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు పా.రంజిత్‌ (Pa Ranjith) దర్శకత్వంలో తెరకెక్కిన తంగలాన్‌ (Thangalaan) సినిమా ఆగస్టు 15న రిలీజైంది. ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో విక్రమ్ మరోసారి విభిన్నంగా కనిపించి ఆకట్టుకున్నాడు. పార్వ‌తి తిరువోతు, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్లుగా క‌నిపించారు. ఈ చిత్రం కథాపరంగాను, కమర్షియల్‍గానూ పర్వాలేదనిపించింది.

తంగలాన్ ఓటీటీ:

అయితే, తంగలాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కి మాత్రం ఎన్నో ఆటంకాలు వచ్చాయి. దాదాపు నాలుగు నెలలు సాగిన  ఓటీటీ స్ట్రీమింగ్‍ పంచాయితీకి తెరపడింది. ఇవాళ మంగళవారం (డిసెంబర్ 10న) అనూహ్యంగా ఓటీటీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్లో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Also Read : డాకు మహారాజ్ పాటల నగరా మొదలు

ఇన్నాళ్లు కోర్టు కేసులు, ఓటీటీతో నిర్మాత సంస్థకు ఉన్న విభేదాల కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన ఈ మూవీ.. మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ అయింది. ఇందులో కొన్ని మతాలను కించపరిచారని మద్రాసు కోర్టులో ప్రజాప్రయోజన పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడో రావాల్సిన తంగలాన్ ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు కోర్టు లైన్ క్లియర్ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొంది థియేటర్‌లో రిలీజైన మూవీకి.. ఓటీటీ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో విక్రమ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.35 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

తంగలాన్  కలెక్షన్లు:

ఇప్పటి వరకు తంగలాన్ చిత్రం వరల్డ్ వైడ్ గాదాదాపు రూ.105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీ ఫుల్ రన్‍లో రూ.110కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు టాక్.

కథేంటంటే:

బ్రిటీష్ వాళ్లు మనల్లి పాలిస్తున్న1850 నాటి కాలం. వెప్పూరు అనే ఊరిలో తంగలాన్, గంగమ్మ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ సంతోషంగా వుంటారు. తరచుగా తన తాతను ఆరతి అనే నాగకన్య తరుముతున్నట్టుగా ఆయనకు కలలు వస్తూ వుంటాయి. అయితే ఒకరోజు చేతికొచ్చిన పంటను ఎవరో తగలబెడతారు. దాంతో పన్నులు కట్టలేక పోవడంతో తంగలాన్ కుటుంబాన్ని వెట్టిచాకిరీ చేయాలని జమిందారు ఆదేశిస్తాడు. అదే టైంలో ఇంగ్లీష్ దొర క్లెమెంట్ బంగారు గనులు తవ్వడానికి వస్తే ఎక్కువ డబ్బులు ఇస్తానని ఆశ చూపించడంతో వారితో వెళ్లిపోతాడు.

తరచు కలలో వచ్చే ఆరతి.. బంగారు గనుల తవ్వకాలకు వెళ్లినప్పుడు తంగలాన్ కు ఎదరురవుతుంది. బంగారాన్ని కాపాడడానికి నాగకన్య ఆరతి తంగలాన్కు అనేక రకాలుగా అడ్డుకుంటుంది.దీంతో తంగలాన్ ఏం చేస్తాడు. వారికి బంగారు దొరుకుతుందా. తంగలాన్ కుటుంబంతో పాటు ఊరి జనాలు కూడా బంగారం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ఏమవుతాయి. అసలు నాగకన్య ఎవరు? నాగకన్యకు తంగలాన్ను ఎందుకు అడ్డుకుంటుంది. ఆమెను అంతం చేయాలనుకున్న తంగలాన్ చివరకు ఏం చేస్తాడు? బ్రిటీష‌ర్ల వెంట వెళ్లిన తంగ‌లాన్ వారిపై ఎందుకు తిరుగుబాటు చేశాడనేది స్టోరీ.