పంద్రాగస్టుకు విక్రమ్ ‘‘తంగలాన్‌‌’’

పంద్రాగస్టుకు  విక్రమ్ ‘‘తంగలాన్‌‌’’

విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్‌‌’.  పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌‌. కబాలి, కాలా చిత్రాల దర్శకుడు పా.రంజిత్ రియల్ ఇన్సిడెంట్స్‌‌ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. 

ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగ‌‌ష్టు 15న విడుద‌‌ల చేయ‌‌బోతున్నట్టు చెప్పారు. నిజానికి జనవరి 26నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అనుకోని కారణాలతో ఆలస్యమైంది. ఇక పంద్రాగస్టుకు టాలీవుడ్ నుంచి ‘డబుల్ ఇస్మార్ట్‌‌’ వస్తుండగా, బాలీవుడ్‌‌ నుంచి ‘స్త్రీ 2’ వస్తోంది. ఈ రెండు చిత్రాలతో ‘తంగలాన్‌‌’ పోటీ పడబోతోంది. కోలార్‌‌‌‌ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌‌ కుమార్‌‌ సంగీతం అందిస్తున్నాడు.