AFG vs NZ: న్యూజిలాండ్ జట్టులో చేరిన భారత మాజీ బ్యాటింగ్ కోచ్

AFG vs NZ: న్యూజిలాండ్ జట్టులో చేరిన భారత మాజీ బ్యాటింగ్ కోచ్

ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టింది. నోయిడాలో జరగనున్న ఈ టెస్ట్ కోసం భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్‌ను న్యూజిలాండ్ తన కోచింగ్ సిబ్బందిలో చేర్చుకున్నట్లు అసోసియేషన్ శుక్రవారం (సెప్టెంబర్ 6) తెలిపింది. రాథోర్‌ భారత్ ద్రవిడ్ ప్రధాన కోచ్ గా ఉన్న సమయంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ గా పని చేశాడు. ద్రవిడ్ తో పాటు రాథోర్ కూడా తన బ్యాటింగ్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పాడు. 

భారత పిచ్ లపై ఆడేటప్పుడు రాథోర్ అనుభవం తమ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని న్యూజిలాండ్ క్రికెట్ తెలిపింది. అయితే రాథోర్ ఈ ఒక్క టెస్ట్ కోసమే కివీస్ జట్టులో ఉంటాడు. భారత్ తరపున అతను ఆరు టెస్ట్ మ్యాచ్ లాడాడు. 2012లో జాతీయ జట్టుకు సెలెక్టర్‌గా పని చేశాడు. మరోవైపు శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరాత్ ను స్పిన్-బౌలింగ్ కోచ్‌గా నియమించబడ్డాడు. హెరాత్ నోయిడాలో జరగబోయే ఏకైక టెస్ట్ తో పాటు ఈ నెలలో శ్రీలంకలో జరిగే రెండు టెస్టుల మ్యాచ్ ల సిరీస్ వరకు కివీస్ జట్టులో కొనసాగుతాడు. సెప్టెంబరు 9 నుండి 13 వరకు నోయిడాలో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలబడతాయి. 

ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు న్యూజిలాండ్ స్క్వాడ్:

టిమ్ సౌతీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వైస్ కెప్టెన్), డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ ఉన్నారు. సాంట్నర్, బెన్ సియర్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.