Veera Dheera Sooran OTT: ఓటీటీలోకి విక్రమ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Veera Dheera Sooran OTT: ఓటీటీలోకి విక్రమ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటించిన లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూరన్:పార్ట్ 2’ (Veera Dheera Sooran). ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌ (S.U.Arun Kumar) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ (మార్చి 27, 2025న) థియేటర్స్ లోకి వచ్చింది. ప్రమాదకరమైన క్రైమ్ నెట్ వర్క్ లో చిక్కుకుని, ఓ మిస్టీరియస్ మిషన్ కోసం పనిచేసే కిరాణా షాప్ ఓనర్ కాళి కథే ఈ వీర ధీర శూరన్.

'వీర ధీర శూరన్..  గ్రామీణ మరియు వాస్తవిక మేకింగ్ తో తెరకెక్కింది. సినిమాలో పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్ మరియు కాస్టింగ్ ఆకట్టుకుంటుంది. చియాన్ విక్రమ్ తో పాటు నటీనటులు వారి పాత్రలో జీవించారు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. 

వీర ధీర శూరన్ ఓటీటీ:

పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్తో వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో నెలరోజుల్లోపే ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధమైంది. నేడు (ఏప్రిల్ 18న) ఈ మూవీ ఓటీటీ అప్డేట్ రివీల్ చేసింది సదరు ఓటీటీ సంస్థ. 

వీర ధీర శూరన్: పార్ట్ 2’మూవీ ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమ్ కానుందని ప్రైమ్ వీడియో వెల్లడించింది. తమిళంలో వచ్చిన ఈ మూవీ.. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ డబ్బింగ్తో అందుబాటులో ఉండనుంది.

వీర ధీర శూరన్ వసూళ్లు:

భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల లోపే గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియాలో చూసుకుంటే రూ.42 కోట్లకి పైగా నెట్ వసూళ్లు చేసింది. అయితే, రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ సుమారు రూ.2 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

రెండు భాగాలుగా రూపొందిన ‘వీర ధీర శూరన్’.. పార్ట్ 2ను ముందుగా తీసుకొచ్చారు మేకర్స్. దీని ప్రీక్వెల్ ను తర్వాత రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. విక్రమ్ సరసన దుషార విజయన్ కథానాయికగా నటించింది. ఎస్.జె. సూర్య, సిద్ధిక్, సూరజ్ వెంజరమూడు, మరియు 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. రియా శిబు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాని NVR సినిమాస్, మైత్రి సంస్థలు తెలుగులో రిలీజ్ చేశాయి.