VeeraDheeraSooran: విక్రమ్ ‘వీర ధీర శూరన్’ X రివ్యూ.. రా అండ్ రస్టిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

VeeraDheeraSooran: విక్రమ్ ‘వీర ధీర శూరన్’ X రివ్యూ.. రా అండ్ రస్టిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటించిన లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూరన్’ (Veera Dheera Sooran). ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌ (S.U.Arun Kumar) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ నేడు గురువారం (మార్చి 27, 2025న) థియేటర్స్ లోకి వచ్చింది.

రెండు భాగాలుగా రూపొందిన ‘వీర ధీర శూరన్’.. పార్ట్ 2ను ముందుగా తీసుకొచ్చారు మేకర్స్. రియా శిబు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాని NVR సినిమాస్, మైత్రి సంస్థలు తెలుగులో రిలీజ్ చేశాయి. టీజర్, ట్రైలర్ విజువల్స్ తో అంచనాలు పెంచిన వీర ధీర శూరన్ పబ్లిక్ టాక్ ఎలా ఉందో X రివ్యూలో తెలుసుకుందాం. 

విక్రమ్ వీర ధీర శూరన్ మూవీకి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వస్తోంది. మరోసారి విక్రమ్ వైవిధ్యమైన పాత్రతో వచ్చాడని, వీరుడిగా, ధీరుడిగా, శూరుడిగా అదరగొట్టినట్లు నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.  

అందులో ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'వీర ధీర శూరన్.. రా, గ్రామీణ మరియు వాస్తవిక మేకింగ్ తో అదిరిపోయింది. సినిమాలో పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్ మరియు కాస్టింగ్ ఆకట్టుకుంది. చియాన్ విక్రమ్ తో పాటు నటీనటులు వారి పాత్రలో జీవించారు. మొత్తం సినిమాలో విక్రమ్ తో వచ్చే డిఫరెంట్ సీన్స్ ఆసక్తిగా ఉంది. చియాన్ గత సినిమాల ఫెయిల్యూర్స్ ను వీర ధీర శూరన్ తుడిచేస్తుందని ' X లో రాసుకొచ్చాడు. 

ఇందులో కాళి పాత్రలో నటించిన విక్రమ్ క్యారెక్టర్.. చెబుతూ 'శక్తివంతమైనవాడు, దుర్బలుడు మరియు ప్రేమించదగినవాడు' అదే అతని బలం మరియు బలహీనత.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీరధీరసూరన్ వాస్తవికతతో కూడిన మాస్‌ను పరిచయం చేశాడు  దర్శకుడు అరుణ్ కుమార్. 

ఇకపోతే.. హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన వీర ధీర శూరన్.. సినిమాకు తెలుగులో చెప్పుకోదగ్గ బజ్ వినిపించడంలేదు. ఈ మూవీకి అదే రోజు  పోటీగా వచ్చిన మోహన్ లాల్ L2:ఎంపురాన్తో పోలిస్తే తక్కువనే చెప్పుకోవాలి. 

ఎందుకంటే, లూసిఫర్ 2 సినిమా మేకర్స్ నెల రోజుల ముందు నుంచి వరుస ప్రమోషన్స్ చేస్తూ హైప్ ఇస్తూ వస్తున్నారు. వీర ధీర శూరన్ మేకర్స్ మాత్రం సినిమా రిలీజ్కు వారం ముందు ప్రమోషన్స్ మొదలు పెట్టారు. దాంతో లూసిఫర్ 2 సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫస్ట్ డే దాదాపు రూ.70 నుంచి రూ.100కోట్ల మేరకు ఓపెనింగ్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక వీర ధీర సూరన్కు సరైన ప్రమోషన్లు లేకపోవడం, రిలీజ్ డేట్ లేట్ అవుతూ రావడం మైనస్గా నిలిచింది. దాంతో ఈ మూవీకి దాదాపు రూ.20 కోట్ల లోపే ఓపెనింగ్ రావొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.