విక్రమ్ ఎప్పుడూ రెండు విషయాలతో ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తుంటాడు. అద్భుతమైన నటన.. డిఫరెంట్ లుక్. ప్రతి సినిమాకీ మేకోవర్ అయిపోతాడు. కొత్త గెటప్‌లో కనిపించి సర్ప్రైజ్ చేస్తాడు. అయితే ఇంతవరకు చేసింది ఒకెత్తు. అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో లలిత్ కుమార్ నిర్మించిన ‘కోబ్రా’లో చేసింది మరొకెత్తు. ఎందుకంటే ఇందులో ఏకంగా ఇరవై అయిదు గెటప్స్‌లో కనిపించ నున్నాడు విక్రమ్. వీటిలో కొన్ని గెటప్స్‌తో పిక్చరైజ్ చేసిన ‘అధీర’ అనే పాటను తాజాగా విడుదల చేశారు. రెహమాన్ ట్యూన్ చేసిన ఈ పాట చాలా జోష్‌ఫుల్‌గా ఉంది. అందులో విక్రమ్ క్యారెక్టర్‌లోని వేరియేషన్స్ చూస్తుంటే వారేవా అనిపిస్తోంది. తన ఇంటెలిజెన్స్‌తో పోలీసులకు చుక్కలు చూపించే ఖతర్నాక్ మ్యాథమెటీషియన్ పాత్ర విక్రమ్‌ది. అందుకే రకరకాల వేషాలు మార్చి కాప్స్ని బోల్తా కొట్టిస్తున్నాడు. ఒకే సినిమాలో ఇన్ని రకాలుగా కనిపించడం చిన్న విషయం కాదు. దాని కోసం విక్రమ్ ఎంతో కష్టపడ్డాడని, ప్రేక్షకులకు థియేటర్లో సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ దొరుకుతుందని మేకర్స్ అంటున్నారు. పాటే ఇంత మెస్మరైజ్ చేసిందంటే మూవీ కచ్చితంగా అలాగే ఉండే చాన్స్ ఉందనిపిస్తోంది. వరుస పరాజయాలతో ఉన్న విక్రమ్‌కి ఈ మూవీ సక్సెస్ కీలకం కూడా. ‘కేజీయఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా కీలక పాత్ర పోషించడం విశేషం.
25 గెటప్స్ లో కనిపించనున్న విక్రమ్
- ఆట
- April 24, 2022
మరిన్ని వార్తలు
-
T20 Cricket: టీ20 క్రికెట్లో ఒక్కడే 900 సిక్సర్లు.. గేల్ ఆల్‌టైం రికార్డ్‌పై వెస్టిండీస్ ఆటగాడు గురి
-
PAK vs WI: బాబర్ ఆజం చెత్త రివ్యూ.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్
-
Rinku Singh: ఎంపీతో భారత క్రికెటర్ రింకూ సింగ్ నిశ్చితార్థం.. ఎవరీమె..?
-
Champions Trophy 2025: ఆ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడతాయి: రచీన్ రవీంద్ర జోస్యం
లేటెస్ట్
- కరీంనగర్ జిల్లాలో 25 ఏళ్ల తర్వాత ట్రాఫిక్ విధుల్లోకి మహిళలు
- డబ్బులు తిరిగి ఇస్తారా.. లేక మరో ఐస్ క్రీమ్ ఇస్తారా? స్విగ్గీకి ఇచ్చిపడేసిన మహిళా ఎంపీ
- సంక్రాంతి వేళ ఆర్టీసీకి కాసుల పంట..వారం రోజుల్లో 16 కోట్ల 47 లక్షలు
- సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది.. మంచు బ్రదర్స్ ట్వీట్ వార్
- కల్లు సీసాలో కట్ల పాము..దుకాణం ధ్వంసం చేసిన గ్రామస్థులు
- T20 Cricket: టీ20 క్రికెట్లో ఒక్కడే 900 సిక్సర్లు.. గేల్ ఆల్‌టైం రికార్డ్‌పై వెస్టిండీస్ ఆటగాడు గురి
- నిజమే చెప్తున్నా..నాకు రుణమాఫీ అయ్యింది..కేటీఆర్‌కు షాకిచ్చిన వృద్ధురాలు
- ఛత్తీస్ గఢ్‌లో మరో ఎన్ కౌంటర్.. మావోయిస్టు కీలక నేత అరెస్ట్
- మొత్తం కాపీ.. పేస్ట్.. బీజేపీ మేనిఫెస్టోపై కేజ్రీవాల్ సెటైర్స్
- PAK vs WI: బాబర్ ఆజం చెత్త రివ్యూ.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్
Most Read News
- ‘ఒకేఒక్కడు’లో అర్జున్‌లా నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం
- హైదరాబాద్‌లో అంబర్పేట్ వైపు ఉండేటోళ్లకు తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు
- తెలంగాణలో వింత: ఏటేటా పెరిగే శివలింగం
- Champions Trophy 2025: ఆ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడతాయి: రచీన్ రవీంద్ర జోస్యం
- Horoscope : ఫిబ్రవరి 1న మీనరాశిలోకి రాహువు, శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి అద్భుత యోగం..!
- Beauty Tips : గోరింటాకులో కాఫీ పొడి కలుపుకుని పెట్టుకుంటే.. తెల్లజుట్టు.. నల్లగా నిగనిగలాడుతుంది తెలుసా..
- Today OTT Movies: ఇవాళ (జనవరి 17న) ఓటీటీలోకి 10కి పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడ చూడాలంటే?
- WPL షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచులో RCB వర్సెస్ గుజరాత్ ఢీ
- తెలంగాణకు 2800 బస్సులు ఇవ్వండి: కేంద్రమంత్రికి CM రేవంత్ రిక్వెస్ట్
- మళ్లీ కొండెక్కి కూర్చున్న బంగారం.. ఒకేరోజు ఇంత పెరిగితే కష్టమే..!