భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్‌కుమార్ సింగ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌కు చెందిన వారు. ఐపీఎస్‌గా ఎంపికైన అనంతరం జాతీయ పోలీసు అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న విక్రాంత్ గతేడాది జనవరి 8న భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ప్రొబిషనరీ విధులు నిర్వర్తించేందుకు వచ్చారు.
మార్చి 4 నుంచి మే 25 వరకు కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత జూన్‌లో జాతీయ పోలీస్ అకాడమీకి వెళ్లిపోయారు. ట్రైనింగ్ తర్వాత గ్రేహౌండ్స్‌లో పనిచేశాక తాజాగా భద్రాచలం ఏఎస్పీగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.