Sector 36 Movie Review: దేశాన్ని కుదిపేసిన వాస్తవ ఘటనల క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘సెక్టార్ 36'

Sector 36 Movie Review: దేశాన్ని కుదిపేసిన వాస్తవ ఘటనల క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘సెక్టార్ 36'

‘ట్వల్త్‌‌ ఫెయిల్‌‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విక్రాంత్‌‌ మస్సే(Vikrant Massey) సుపరిచితం. ట్వల్త్‌‌ ఫెయిల్‌‌ లోని విక్రాంత్‌‌ నటనకు, తన హవాభాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో విక్రాంత్‌‌ మస్సే నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఒక తెలియని జోష్. 

ప్రస్తుతం హీరో విక్రాంత్‌‌ మస్సే సెక్టార్ 36 (Sector 36) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీపక్ డోబ్రియాల్, దినేష్ విజన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నా ఈ మూవీని ఆదిత్య నింబ‌ల్‌క‌ర్ డైరెక్ట్ చేసాడు. సెక్టార్  36 మూవీ ప్ర‌ముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ గా శుక్రవారం  (సెప్టెంబ‌ర్ 13న) తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ కి వచ్చింది.

ఈ మూవీ 2006లో జరిగిన నిఠారీ వరుస హత్యల ఆధారంగా రూపొందించబడింది. ట్రైలర్ తోనే ఆడియన్స్ పల్స్ ను టచ్ చేసిన మేకర్స్..క్రియేటివిటీ, విక్రాంత్ నటన, కథ కథనాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 

కథేంటంటే:

నిఠారీ కేసు అని కూడా పిలువబడే 2006 సీరియల్ మర్డర్‌ల ఆధారంగా, ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మురికివాడ ప్రాంతంలోని చిన్నపిల్లలను.. కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి ఎలాంటి వేదనలకు గురిచేశారు..వారి జీవితాలను బాల్యంలోనే ఎలా నాశనం చేశారన్న కథాంశాన్ని ఇందులో చక్కగా చూపించారు. 

ఇలా నోయిడాలోని సెక్టార్ 36 మురికివాడ ప్రాంతంలో పిల్ల‌లు వ‌రుస‌గా కిడ్నాప్ అవ్వడం అంతా భయాందోళనలు కలిగిస్తోంది. అయితే ఆ కిడ్నాప్ చేసేది ఎవ‌రు.. అత‌డిని ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు ఏం చేశారు అనేది స్టోరీ.

ALSO READ | Mathu Vadalara 2 Review: మత్తు వదలరా 2’ రివ్యూ..సస్పెన్స్ క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

విక్రాంత్ మాస్సే ఈ మూవీలో ప్రేమ్ సింగ్ అనే కిడ్నాపర్ గా నటించాడు.అతను పెడోఫిల్, కిరాత హంతకుడు. ఢిల్లీలో నివసిస్తున్న వృద్ధుడైన మిస్టర్ బస్సీ కోసం ప్రేమ్ సింగ్ పనిచేస్తుంటాడు.తన యజమానిని ప్రేమ్ సింగ్ సంతోషపెట్టాలనే లక్ష్యంగా పనిచేస్తుంటాడు. కిడ్నాప్ చేయబడిన పిల్లలను తమ శాడిస్ట్ ఆనందాల కోసం..అవయవ అక్రమ రవాణా చేయడం ఇదంతా చేస్తుంటారు. అయితే, భయంకరమైన రీతిలో హత్యలకు పాల్పడటం వంటి సీన్స్ కి ప్రతిఒక్క ఆడియన్ చలిస్తాడు. వాస్తవానికి నిఠారీ హత్యలు దేశాన్ని కుదిపేసింది మరియు దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఇక కిడ్నపార్ చేసే అఘాయిత్యాలకు గురవుతన్న చిన్న పిల్లల కోసం ఒక పోలీసు అధికారి (దీపక్ డోబ్రియాల్) నిలబడతాడు. అతను తన విధుల పట్ల ఎంతో నిబద్దతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి..సెక్టార్ 36 నుండి తప్పిపోయిన అనేక మంది పిల్లలను అపహరించిన వ్యక్తిని పట్టుకోవాలనుకునే క్రమంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి? కిల్లర్స్ నుండి పిల్లలను కాపాడటానికి ఎలాంటి దారులు ఎంచుకున్నారు? అనే మిగతా విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఈ చిత్రం కోసం ప్రేమ్ అనే కిల్లర్ పాత్రలో హీరో విక్రాంత్ మాస్సే జీవించిపోయాడు.ఇంతకు ముందు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా నటించాడు. అసలు ఒక వ్యక్తిగా భయంకరమైన కిల్లర్‌ పాత్రలో అందరిని ఒప్పించేలా చేయడం చాలా కష్టం అని విక్రాంత్ ఇటీవలే ఇంటర్వ్యూలో చెప్పినట్లుగానే నటించాడు.