IIFA Digital Awards 2025: ఘనంగా మొదలైన ఐఫా అవార్డు వేడుకలు.. విజేతలు వీరే..!

IIFA Digital Awards 2025: ఘనంగా మొదలైన ఐఫా అవార్డు వేడుకలు.. విజేతలు వీరే..!

సినీ రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి ప్రధానంచేసే ఐఫా అవార్డుల వేడుక శనివారం ఘనంగా మొదలైంది. ఇందులోభాగంగా రెండు రోజులపాటు ఈ ఐఫా అవార్డుల ప్రధానం కార్యక్రమం జైపుర్‌ లో జరగనుంది. అయితే ఈ కార్యక్రమంలో తొలిరోజుబాలీవుడ్‌ సినీ సెలెబ్రెటీలు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. దేంతో సినీ అంతరాల చిందులు, లేజర్ లైట్ల వెలుగులతో అట్టహాసంగా వేడుక మొదలైంది. 

Also Read:-ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్ సీరీస్లు ఇవే.. 

శనివారం రాత్రి ఐఫా డిజిటల్‌ అవార్డులను ప్రదానం చేశారు. తొలిరోజు దో పత్తి సినిమాలో డబుల్ యాక్షన్ తో అలరించిన ప్రముఖ హీరోయిన్ కృతి సనన్‌ కి ఐఫా అవార్డు అందించారు. అలాగే సెక్టార్‌ 36 క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో యాక్టింగ్ తో ఆకట్టుకున్న విక్రాంత్‌ మస్సే ఉత్తమ నటుడి విభాగంలో ఐఫా అవార్డు అందుకున్నాడు. 

 

ఐఫా అవార్డు విజేతలు వీరే:

ఉత్తమ నటుడు: విక్రాంత్‌ మస్సే (సెక్టార్‌ 36)
ఉత్తమ నటి: కృతి సనన్‌ (దో పత్తి)
ఉత్తమ చిత్రం: అమర్‌ సింగ్‌ చంకీలా
ఉత్తమ సిరీస్‌: పంచాయత్‌ సీజన్‌ 3
ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్‌: యో యో హనీ సింగ్‌: ఫేమస్‌
ఉత్తమ నటి: శ్రేయాచౌదరి (బందీశ్‌ బందిట్స్‌ సీజన్‌ 2)
ఉత్తమ దర్శకుడు: దీపక్‌ కుమార్‌ మిశ్రా (పంచాయత్‌ సీజన్‌ 3)
ఉత్తమ సహాయ నటుడు: ఫైజల్‌ మాలిక్‌ (పంచాయత్‌ సీజన్‌ 3)
ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్‌ అలీ (అమర్‌ సింగ్‌ చంకీలా)
ఉత్తమ సహాయ నటుడు: దీపక్‌ (సెక్టార్‌ 36)
ఉత్తమ సహాయ నటి: అనుప్రియా గోయెంకా (బెర్లిన్‌)
ఉత్తమ కథ: కనికా ధిల్లాన్‌ (దో పత్తి)
ఉత్తమ నటుడు: జితేంద్ర కుమార్‌ (పంచాయత్‌ సీజన్‌ 3) 
ఉత్తమ సహాయ నటి: సంజీదా షేక్‌ (హీరామండి: ది డైమండ్‌ బజార్‌)
ఉత్తమ కథ: కోటా ఫ్యాక్టరీ సీజన్‌ 3
ఉత్తమ రియాల్టీ సిరీస్‌: ఫ్యాబ్యులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్