12thFail: స్టార్ హీరో సంచలన నిర్ణయం.. నటనకు గుడ్ బై చెబుతూ పోస్ట్

12thFail: స్టార్ హీరో సంచలన నిర్ణయం.. నటనకు గుడ్ బై చెబుతూ పోస్ట్

‘ట్వల్త్‌‌ ఫెయిల్‌‌’(12thFail) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విక్రాంత్‌‌ మస్సే(Vikrant Massey) సుపరిచితం. ట్వల్త్‌‌ ఫెయిల్‌‌ లోని విక్రాంత్‌‌ నటనకు, తన హవాభాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో విక్రాంత్‌‌ మస్సే నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్లో ఒక తెలియని జోష్. 

ఇటీవలే సెక్టార్ 36 (Sector 36) అనే క్రైమ్ థ్రిల్లర్తో వచ్చి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. అలాగే  ‘ది సబర్మతి రిపోర్ట్‌‌’ (The Sabarmati Report) రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో జర్నలిస్టు పాత్రలో నటించి మెప్పించాడు. 

అయితే ఈ రియల్ హీరో ఇవాళ సోమవారం (డిసెంబర్ 2న) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వ్యక్తులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక తాను కొంత కాలంపాటు కొత్త సినిమాలు చేయబోనంటూ విరామం ప్రకటించారు. దీనిపై ఇన్‌స్టా వేదికగా ఓ నోట్‌ రిలీజ్ చేశారు. 

ALSO READ | ఘంటసాల బయోపిక్ చూడటం తెలుగు వారి కర్తవ్వం: వెంకయ్యనాయుడు

'కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అందరి నుంచి అసాధారణమైన ప్రేమను, అభిమానాన్ని పొందుతున్నాను. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఒక భర్తగా, తండ్రిగా ఇప్పుడు నేను కుటుంబానికి పూర్తి సమయం కేటాయించాల్సిన టైమ్‌ వచ్చింది. అందుకే కొత్త సినిమాలను ఇక అంగీకరించడం లేదు. 2025లో రిలీజ్ కానున్న సినిమానే నా లాస్ట్ మూవీ. చివరిసారిగా మనం కలవబోతున్నాం. కాగా ఇటీవల నేను నటించిన సినిమాలపై మీరు చూపిన ఆదరాభిమానాలు మర్చిపోలేను. ఎన్నో అందమైన జ్ఞాపకాలను ఇచ్చారు. అందరికీ కృతజ్ఞతలు.. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాడు' అని నోట్‌లో వెల్లడించారు.

ఇక విక్రాంత్‌‌ మస్సే తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఒకింత బాధకు గురిచేస్తోంది. 'ఒక మంచి సహజ నటుణ్ని చూడలేకపోతున్నాం.. తిరిగి నటించాలని కోరుకుంటున్నాం' అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం విక్రాంత్ ట్వల్త్‌‌ ఫెయిల్‌‌ ప్రీక్వెల్ లో నటిస్తున్నాడు.