OTT Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

‘ట్వల్త్‌‌ ఫెయిల్‌‌’ హీరో విక్రాంత్‌‌ మస్సే(Vikrant Massey) లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘ది సబర్మతి రిపోర్ట్‌‌’ (The Sabarmati Report). రాశీ ఖన్నా, రిద్ధి డోగ్రా హీరోయిన్స్. గోద్రా రైలు దహనం, గుజరాత్ అల్లర్ల ఆధారంగా రంజన్‌‌ చందేల్‌‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఏక్తాకపూర్ నిర్మాత.

నిజాలను వెలికితీసే జర్నలిస్టు పాత్రలో హీరో విక్రాంత్ మస్సే నటన చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అతను తన ఉద్యోగ విలువల  కోసం పడే తపన, ఎంతో మంది అమాయక జీవితాలపై జరిగిన భయానక ఘటనపై చేసే విచారణ.. తనదైన నటనతో విక్రాంత్ ప్రాణం  పోశాడు.

ఈ మూవీ న్యూస్‌రూమ్ రాజకీయాల్లో చిక్కుకున్న నిజాయితీ గల జర్నలిస్ట్ సమర్ కుమార్‌ను అనుసరిస్తుంది. "ప్రపంచం నిజం కోసం మీడియా వైపు చూస్తుంది, కానీ మీడియా నిజాన్ని చిత్రీకరించే ముందు దాని యజమానుల వైపు చూస్తుంది" అనేది ఈ మూవీ ప్రధాన ఎజెండా.

ది సబర్మతి రిపోర్ట్‌ ఓటీటీ:

ఈ మూవీ 2024 నవంబర్ 15న థియేటర్స్లో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా బాగానే రాబట్టింది. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు వసూలు చేసింది.

ALSO READ | Sreeleela: స్టార్ హీరో కొడుకు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్... శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్..

అలాగే డిసెంబర్ 2న భారత ప్రధాని పార్లమెంట్లో ఈ మూవీని వీక్షించడంతో మరింత మందికి వీక్షించడంతో మరింత మందికి ఈ మూవీ గురించి తెలిసింది. దాంతో సినిమాను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇపుడీ ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది.శుక్రవారం జనవరి 10 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటూ X లో కొత్త మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా .. "దేశంలోని అతిపెద్ద కవరప్ స్టోరీ బయటకు వచ్చింది. నిజమేంటో మీ జీ5లో చూడండి. ది సబర్మతి రిపోర్ట్ జనవరి 10 నుంచి కేవలం మీ జీ5లో రాబోతుంది" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ వివరాలు వెల్లడించింది. 2024 ఏడాదిలో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా ది సబర్మతి రిపోర్ట్‌ నిలిచింది. 

కథేంటంటే::

2002 ఫిబ్రవరి 27 ఉదయం గోద్రాలో జరిగిన సబర్మతి ఎక్స్‌‌ప్రెస్‌‌ రైలు దహనం ఇన్సిడెంట్‌లో.. నిజంగా ఏం జరిగిందనే వాస్తవాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. అయితే, నిజంగా బయట జరిగిన సంఘటనగా చెప్పుకుంటే.. ఫిబ్రవరి 27, 2002 ఉదయం, సబర్మతి ఎక్స్‌ప్రెస్ - కోచ్ S6 కు కొంతమంది నిప్పు పెట్టారు. అప్పుడు ఆ కోచ్‌లో ప్రయాణిస్తున్న 59 మంది ప్రయాణికులు కాలి బూడిదయ్యారు. బాధితుల్లో 27 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నారు. రైలులో ఉన్న మరో 48 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

అయోధ్యలోని మతపరమైన సమావేశానికి వెళ్లి తిరిగి వస్తున్న వారు ఈ రైలులో ఉన్నారు. అందులో ముఖ్యంగా హిందూ సమాజానికి చెందిన వ్యక్తులు ఉన్నారు.అయితే ఈ ఘటన కొన్ని గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక అల్లర్లకు దారితీసింది. ఫిబ్రవరి 2 సాయంత్రం జరిగిన అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా 2-3 నెలల పాటు కొనసాగాయి. అల్లర్లలో 254 మంది హిందువులు, 790 మంది ముస్లింలు మరణించారు. ఇక ఈ భీబత్సం ఎవరు స్పృష్టించారు? ఈ భయానక ఘటనలపై జరిగిన రాజకీయమేంటీ? ఈ ఘటనపై సంబంధించి ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన తప్పుడు కథనాల ఆధిపత్యానికి కారకులెవరు? అనేది సినిమాలో అందుకోసం బాధ్యతగా ఎవరు పోరాడారు? ఈ దాడికి పాల్పడ్డవారికి చట్టం ఎలాంటి శిక్ష వేసింది? అనేది ప్రధాన స్టోరీ.