ఇండియా నుండి ఆర్ఆర్ఆర్ (RRR) ఆస్కార్ (Oscar) సాధించిన తరువాత ఇప్పుడు చాలా సినిమాలు ఆస్కార్ అవార్డు కోసం తమ సినిమాలను పంపించాలని ఆరాట పడుతున్నాయి. సినిమాలో కంటెంట్ ఉంటే అది ఏ సినిమా అయినా? ఏ భాష సినిమా అయినా ఆస్కార్ గెలిచే సత్తా ఉంటుంది. అందుకే చాలా మంది మేకర్స్ ఆ దారిలో అడుగులు వేస్తున్నారు.
లేటెస్ట్గా ఆస్కార్ అవార్డు కోసం బాలీవుడ్ నుంచి 12'th FAIL మూవీ పోటీ పడుతోంది. ఇండిపెండెంట్ నామినేషన్ కింద 12th ఫెయిల్ సినిమాను ఆస్కార్స్‌కు పంపించినట్లు హీరో విక్రాంత్ మాసే వెల్లడించారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్..ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.కాపీ కొట్టి పరీక్షలు రాసే చంబల్ విద్యార్థి కథను ఆస్కార్ వరకు తీసుకెళ్లడంలో డైరెక్టర్ వినోద్ చోప్రా కీ రోల్ పోషించాడు. కాపీ కొట్టే స్టూడెంట్..పట్టుదలతో చదవి చివరకు కాపీ కొట్టకుండానే పాసై..జీవితంలో ఎలా ఐపీఎస్ అయ్యాడన్న స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు.
ఈ సినిమా అక్టోబర్ 27న హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో రిలీజయింది. మనోజ్ పాత్రలో విక్రాంత్ మాసే నటించారు. మేధా శంకర్ హీరోయిన్ గా నటించింది. అనురాగ్ పాఠక్ రాసిన నవల ఆధారంగా 12th ఫెయిల్ సినిమాను వినోద్ చోప్రా డైరెక్ట్ చేశారు. ఈ మూవీని ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ ఆఫీసర్ శ్రద్ధా జోష్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు.
ఇప్పటికే ఆస్కార్ అవార్డుల కోసం పలు ఇండస్ట్రీల నుంచి సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో తెలుగు నుంచి బలగం, నాని దసరా, మలయాళంలో హిట్ అయ్యి..తెలుగులో డబ్ అయిన 2018 మూవీ, షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలు పోటీలో ఉన్న విషయం తెలిసిందే.
మరి ఈ సినిమాలు కూడా దేనికదే ప్రత్యేకంగా ఆస్కార్ బరిలో దిగనున్నాయి.వీటిలో ఏ సినిమాకు అవార్డు వరిస్తుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.
@VikrantMassey has confirmed that '12th Fail,' directed by Vidhu Vinod Chopra and featuring Massey in the lead role, has been submitted as an independent nomination for the Oscars.@VVCFilms @TheAcademy#12thFail #Oscars #vikrantmasseyin12thfail pic.twitter.com/O72qae6Eve
— TheProcessor (@in_theprocessor) November 25, 2023