‘ట్వల్త్ ఫెయిల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విక్రాంత్ మస్సే(Vikrant Massey) సుపరిచితం. ట్వల్త్ ఫెయిల్ లోని విక్రాంత్ నటనకు, తన హవాభాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో విక్రాంత్ మస్సే నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఒక తెలియని జోష్.
లేటెస్ట్ విషయానికి వస్తే.. విక్రాంత్ మస్సే హీరోగా నటించిన కొత్త చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’ (The Sabarmati Report). రాశీ ఖన్నా, రిద్ధి డోగ్రా హీరోయిన్స్. గోద్రా రైలు దహనం, గుజరాత్ అల్లర్ల ఆధారంగా రంజన్ చందేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఏక్తాకపూర్ నిర్మాత.
ఈ మూవీ ఇవాళ నవంబర్ 15న థియేటర్స్లో రిలీజైంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉంది? జరిగిన సంఘటనలే చూపించారా? లేదా అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటంటే::
2002 ఫిబ్రవరి 27 ఉదయం గోద్రాలో జరిగిన సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు దహనం ఇన్సిడెంట్ లో.. నిజంగా ఏం జరిగిందనే వాస్తవాలను చూపిస్తూ సాగిన ఈ మూవీ ఆలోచింపజేస్తోంది. నిజంగా బయట జరిగిన సంఘటనగా చెప్పుకుంటే..
ఫిబ్రవరి 27, 2002 ఉదయం, సబర్మతి ఎక్స్‌ప్రెస్ - కోచ్ S6 కు కొంతమంది నిప్పు పెట్టారు. అప్పుడు ఆ కోచ్‌లో ప్రయాణిస్తున్న 59 మంది ప్రయాణికులు కాలి బూడిదయ్యారు. బాధితుల్లో 27 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నారు. రైలులో ఉన్న మరో 48 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అయోధ్యలోని మతపరమైన సమావేశానికి వెళ్లి తిరిగి వస్తున్న వారు ఈ రైలులో ఉన్నారు. అందులో ముఖ్యంగా హిందూ సమాజానికి చెందిన వ్యక్తులు ఉన్నారు.
ALSO READ | Kanguva BoxOffice: కంగువ ఫస్ట్ డే కలెక్షన్స్..
అయితే ఈ ఘటన కొన్ని గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక అల్లర్లకు దారితీసింది. ఫిబ్రవరి 2 సాయంత్రం జరిగిన అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా 2-3 నెలల పాటు కొనసాగాయి. అల్లర్లలో 254 మంది హిందువులు, 790 మంది ముస్లింలు మరణించారు.
ఇక ఈ భీబత్సం ఎవరు స్పృష్టించారు? ఈ భయానక ఘటనలపై జరిగిన రాజకీయమేంటీ? ఈ ఘటనపై సంబంధించి ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన తప్పుడు కథనాల ఆధిపత్యానికి కారకులెవరు? అనేది సినిమాలో అందుకోసం బాధ్యతగా ఎవరు పోరాడారు? ఈ దాడికి పాల్పడ్డవారికి చట్టం ఎలాంటి శిక్ష వేసింది? అనేది ప్రధాన స్టోరీ.
ఎలా ఉందంటే::
ఈ మూవీ న్యూస్‌రూమ్ రాజకీయాల్లో చిక్కుకున్న నిజాయితీ గల జర్నలిస్ట్ సమర్ కుమార్‌ను అనుసరిస్తుంది. "ప్రపంచం నిజం కోసం మీడియా వైపు చూస్తుంది, కానీ మీడియా నిజాన్ని చిత్రీకరించే ముందు దాని యజమానుల వైపు చూస్తుంది" అనేది ఈ మూవీ ప్రధాన ఎజెండా.
ఓవైపు హృదయాన్ని కదిలించే ప్రమాద దృశ్యాలు, మరోవైపు మతపరమైన ఉద్రిక్తతలు, ఇంకోవైపు ఆ ఘటన చుట్టూ అలుముకున్న రాజకీయాల అసలు నేపథ్యం ఏంటీ? అనే కోణంలో ఈ సినిమా తెరెకెక్కించారు.
అయితే, ఈ భయానక సంఘటన గురించి పరస్పర విరుద్ధమైన నివేదికలు, వ్యక్తుల సిద్ధాంతాలు.. దీనిపై నానావతి-మెహతా కమీషన్ యొక్క అన్వేషణల ఆధారంగా సబర్మతి మూవీ రూపొందించబడింది. గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ యొక్క S-6 మరియు S-7 కోచ్‌లపై ఒక పెద్ద ముస్లిం గుంపు దాడి చేసి.. రైలుకు నిప్పు పెట్టడానికి ముందు రాళ్లు విసిరి, నష్టానికి దారితీసింది.. వంటి అంశాలను చక్కగా చూపించడానికి చాలా కేస్ స్టడీ చేశారు మేకర్స్.
ఇంగ్లీష్ మీడియాలో చూపించే కథనాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సినిమాలో హీరో చేసే పోరాటం ఆధ్యంతం ఆసక్తిగా ఉంది. ఎంతోమంది అమాయక జీవితాలు ఎలా చిద్రమయ్యాయి అనేది కళ్ళకి కట్టినట్లు తెరపై చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే చనిపోయిన 59 మంది అమాయక జీవితాల పక్షాన పోరాడిన వ్యక్తుల కథ ఇది.
ఎవరెలా చేశారంటే::
నిజాలను వెలికితీసే జర్నలిస్టు పాత్రలో హీరో విక్రాంత్ మస్సే నటన చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అతను తన ఉద్యోగ విలువల కోసం పడే తపన, ఎంతో మంది అమాయక జీవితాలపై జరిగిన భయానక ఘటనపై చేసే విచారణ.. తనదైన నటనతో విక్రాంత్ ప్రాణం పోశాడు. రాశి ఖన్నా, రిధి డోగ్రా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులుగా వారి నటనతో మెప్పించారు. రిధి డోగ్రా మణికా పాత్రలో కఠినమైన, మీడియా హౌస్ హెడ్ బాస్గా నటించింది. రాశి ఖన్నా జర్నలిస్ట్ అమృతగా నటించి కథకు పూర్తి న్యాయం చేసింది.