Vikrant Massey: 52 ఏళ్ల అంతర్యుద్ధంపై సినిమా.. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ పాత్రలో స్టార్ హీరో

Vikrant Massey: 52 ఏళ్ల అంతర్యుద్ధంపై సినిమా.. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ పాత్రలో స్టార్ హీరో

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు,ఆధ్యాత్మిక గురువు  శ్రీశ్రీ రవిశంకర్‌ పాత్రలో హీరో విక్రాంత్ మస్సే నటించనున్నాడు. పఠాన్‌, వార్‌’ వంటి మూవీస్ తో డైరెక్టర్ గా ఫేమ్‌ అందుకున్న సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఓ భారీ ప్రాజెక్ట్ నిర్మించనున్నాడు. ఆయన ప్రొడ్యూసర్ మహావీర్ జైన్ తో కలిసి ‘వైట్‌’ (White) అనే భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

మౌంటూ బస్సీ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో విక్రాంత్ మస్సే గురుదేవ్ రవిశంకర్‌ పాత్రలో కనిపించనున్నాడు.  “కొలంబియాలో 52 ఏళ్ల పాటు జరిగిన అంతర్యుద్ధాన్ని ముగించడంలో శ్రీ శ్రీ రవిశంకర్ పాత్ర ఎలా కీలకంగా మారిందో ఈ మూవీలో చూపించనున్నారు ”.

వైట్ అనేది.. 'విభజన మరియు హింస' ద్వారా తరచుగా నలిగిపోతున్న ప్రపంచంలో శాంతిని నిర్మించడం, కరుణ మరియు అహింస యొక్క శక్తికి నివాళి ఇవ్వడం ప్రధాన ఉద్దేశ్యం. దానికి తోడు ఉద్రిక్త చర్చలు, వాస్తవ ప్రపంచ సంఘర్షణ మరియు లోతైన మానవ కథలను మిళితం చేసే ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ గ్లోబల్ థ్రిల్లర్‌గా ఇది తెరకెక్కనుంది.

ఈ మూవీకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కొలంబియాలో జరుగుతున్నాయి. రెగ్యులర్‌ షూట్‌ జులై నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు. వైట్ చిత్రాన్ని హిందీ, ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషలలో కూడా నిర్మించనున్నారు. అంతేకాకుండా  అనేక ఇతర అంతర్జాతీయ భాషలలో కూడా డబ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. 

ALSO READ : AbirGulaal: పాక్ నటుడు ఫవాధ్​ఖాన్‌కు షాక్.. యూట్యూబ్ నుంచి 'అబీర్ గులాల్' సాంగ్స్ డిలీట్

ఈ సినిమాకోసం హీరో విక్రాంత్ మస్సే తన మేకోవర్ను రెడీ చేసుకుంటున్నాడు. ఇప్పటికే, తన జుట్టును శ్రీ శ్రీ రవిశంకర్ లాగా  పెంచుకున్నాడు. వీలైనంతగా ఆయనలా కనిపించడానికి శారీరక పరివర్తన కూడా మార్చుకునే పనిలో ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్లో వరల్డ్ వైడ్ టెక్నీషియన్స్ భాగం కానున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. 

‘ట్వల్త్‌‌ ఫెయిల్‌‌’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విక్రాంత్‌‌ మస్సే సుపరిచితం. ట్వల్త్‌‌ ఫెయిల్‌‌ లోని విక్రాంత్‌‌ నటనకు, తన హవాభాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో విక్రాంత్‌‌ మస్సే నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఒక తెలియని జోష్.అందులో భాగంగా సెక్టార్ 36, ది సబర్మతి రిపోర్ట్‌‌’ లాంటి చిత్రాలతో విక్రాంత్ మాస్సే నటుడిగా చక్కని గుర్తింపును అందుకున్నాడు.