హామీలు నెరవేర్చకుండా మా గ్రామానికి ఎందుకు వచ్చారు: గ్రామస్థులు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం అరేగుడెం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నకిరేకల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఇచ్చిన హామీలు నెరవేర్చుండా మా గ్రామనికి ఎందుకు వచ్చారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

లక్ష రూపాయల రుణమాఫీ చెయ్యలేదని, అభయ హస్తం డబ్బులు ఇవ్వడం లేదని అడుగడుగునా ఓట్లర్ల నిలదీశారు. 

గతంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం ప్రత్యర్థులతో దెబ్బలు తిని మరి ఓట్లు వేసి గెలిపిస్తే.. ఇప్పుడు అవన్ని మరచిపోయారా అని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్, బీజేపీ నాయకులు కంప్లైంట్ చెయ్యడం వల్లనే పథకాలు ఆగిపోయాని.. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఓటర్లకు సద్ధి చెప్పే ప్రయత్నం చేశారు.