ఆఫీసర్ల నిర్వాకం
ఓ పిల్లాడికి రెండేళ్లు.. కానీ ఆ చిన్నారి బర్త్‌సర్టిఫికెట్ ప్రకారం 102 ఏళ్లు. మరో పిల్లాడికి నాలుగేళ్లు.. కానీ అతడి బర్త్‌సర్టిఫికెట్ ప్రకారం 104 ఏళ్లు. ఈ వింత ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు లంచం అడగ్గా, ఇవ్వకపోవడంతో ఆఫీసర్లే ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారు. షాజహన్‌పూర్ ఖుతార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బేలా ఊరిలో ఈ సంఘటన జరిగింది. పవన్కుమార్అనే వ్యక్తి తన ఇద్దరు మేనల్లుళ్లు సుభ్(2), సంకేత్(4)లకు బర్త్ సర్టిఫికెట్ కోసం2 నెలల క్రితం ఆన్లైన్లో అప్లై చేశాడు. అయితే, ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.500 లంచం ఇవ్వాలని విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుశీల్చంద్ అగ్నిహోత్రి, విలేజ్ హెడ్ ప్రవీణ్మిశ్రా డిమాండ్ చేశారు. పవన్ లంచం ఇవ్వకపోవడంతో పుట్టిన తేదీలను 2018 జనవరి 6కు గాను 1918 జనవరి 6 (సుఖ్)గా, 2016 జూన్ 13కు గాను 1916 జూన్13 (సంకేత్)గా వేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.