![పల్లెటూరి ఓపెన్ జిమ్....](https://static.v6velugu.com/uploads/2025/02/webthumb3_lFsaiKezCv.png)
వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం సుంకెట గ్రామంలో పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపెన్ జిమ్ ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామస్తులు అందరూ జిమ్ కు వచ్చి వ్యాయమాలు చేసుకుంటున్నారు.
దీంతో పాటు చిన్నారులు ఆడుకునేందుకు కూడా వివిధ రకాల పరికరాలు ఉండటంతో చిన్నారులను తీసుకుని తల్లిదండ్రులు వస్తున్నారు. ఇటు తల్లిదండ్రులకు వ్యాయామం, చిన్నారులకు ఆటవిడుపుతో ఈ ఓపెన్ జిమ్ ఏరియా సందడిగా మారుతుంది.