హనుమకొండ/ హనుమకొండ సిటీ, వెలుగు: 'మాకు ప్రభుత్వ పథకాలు ఇవ్వకున్నా ఫర్వాలేదు. పొగతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డంప్‌యార్డును తరలించి మా ప్రాణాలను కాపాడండి' అంటూ మడికొండ, రాంపూర్, ఎలుకుర్తి గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేశారు. హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందించి, తమ సమస్యను కలెక్టర్‌కు వివరించారు.
మడికొండ డంప్ యార్డును అక్కడి నుంచి తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డంప్‌యార్డు అడ్హక్కమిటీ సభ్యులు తౌటిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, దువ్వ నవీన్, ఎర్రగట్టు స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, డంప్ యార్డు సమస్యపై వినతిపత్రం ఇచ్చేందుకు మూడు గ్రామాల ప్రజలు దాదాపు వంద మంది సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
కానీ మెయిన్గేట్వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళం ఏర్పడింది. ఆ తర్వాత కొంతమందిని అనుమతించగా, అక్కడ అడిషనల్కలెక్టర్వెంకట్రెడ్డి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కానీ తమ సమస్యపై కలెక్టర్ప్రావీణ్యకు పూర్తి అవగాహన ఉందని, కలెక్టర్ కే విన్నవించుకుంటామని గ్రీవెన్స్హాలులోనే గంట పాటు బైఠాయించారు. ఆలస్యంగా కలెక్టర్ప్రావీణ్య గ్రీవెన్స్ కు అటెండ్అవడంతో ఆమెకు వినతిపత్రం అందించి అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా, సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి 127 అర్జీలు రాగా, వాటన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన రివ్యూలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంభించిన నాలుగు పథకాలకు సంబంధించిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి, ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
జనగామ అర్బన్/ మహబూబాబాద్: ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జనగామ కలెక్టర్రిజ్వాన్బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని అడిషనల్ కలెక్టర్లు పింకేశ్‌కుమార్, రోహిత్ సింగ్‌తో కలిసి ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 42 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో వినతులు స్వీకరించగా, మొత్తం 165 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు.
ములుగు జిల్లాలో 38 దరఖాస్తులు..
ములుగు: ములుగు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో 38 అర్జీలను వచ్చాయని కలెక్టర్ దివాకర తెలిపారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూజిల్లాలో ప్రభుత్వం ప్రారంభించిన నాలుగు పథకాల అమలులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినంతరదనలు తెలిపారు. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ చిన్న జాతరను విజయవంతం చేయడానికి కృషి చేయాలని సూచించారు.