ముత్తారం, వెలుగు : ముత్తారంలోని కాసర్లగడ్డ బస్టాండ్ సమీపంలో ఉన్న కోళ్ల ఫారంను తొలగించాలని గ్రామస్తులు శుక్రవారం ముత్తారం–మంథని మెయిన్‌రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోళ్లఫారం నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈగలు, దోమల స్వైరవిహారంతో అనారోగ్యాల బారిన పడుతున్నామన్నారు.
ఈ విషయమై స్థానిక, జిల్లా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంథని సీఐ సతీశ్, ఎస్‌ఐ మధుసూదన్, ఎంపీవో వేణుమాధవ్ అక్కడికి చేరుకొని కోళ్లఫారం యజమానితో మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామస్తులు కేవీ చారి, రాములు, రాజ్‌కుమార్, మొగిలి, శ్రీనివాస్, లక్ష్మణ్, సంపత్, కరీం, అజిత్ పాల్గొన్నారు.