
మరికల్, వెలుగు : మండలంలోని పూసల్పహాడ్కు అనుబంధ గ్రామమైన సంజీవరాయకొండ గుట్టల ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందని గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారంతో అటవీ ప్రాంతానికి దగ్గరలో వ్యవసాయ భూములు ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. 4 నెలలుగా చిరుత తిరుగుతోందని, మూగ జీవాలను చంపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.