బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు.. సమాధానం చెప్పలేక వెళ్లిపోయిన ఎమ్మెల్యే

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్ ప్రజలు అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామస్థులు బోధన్ ఎమ్మెల్యే షకీల్ ప్రచారాన్ని అడ్డుకున్నారు. తమ గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అందలేవని.. అభివృద్ధి పనులు జరగలేవని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూంలు వంటి పలు అంశంపై ప్రశ్నించారు.

ఇన్ని రోజులు గుర్తుకురాని గ్రామాలు ఇప్పుడు గుర్తచ్చాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రచారం చేయకుండానే ఎమ్మెల్యే షకీల్ అక్కడినుంచి వెళ్లిపోయారు.