- ఇందిరమ్మ’ అర్హుల జాబితాలో పేర్లు లేకపోవడంతో ఎంపీడీఓతో గ్రామస్తుల వాగ్వాదం
- కరీంనగర్ జిల్లా చిన్న కోమటిపల్లిలో ఘటన
జమ్మికుంట, వెలుగు: ఇంటి, నల్లా పన్నులు చెల్లి స్తేనే ఇందిరమ్మ ఇండ్లకు ఫొటోలు తీసుకుంటామని పంచాయతీ సిబ్బంది ఒత్తిడి తెచ్చి వసూలు చేసిన ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మం డలం చిన్నకోమటిపల్లిలో ఆలస్యంగా తెలిసింది. ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని అప్పు చేసి మరి పన్నులు కట్టామని, తీరా ఇండ్ల జాబితాలో తమ పేర్లు లేవని చిన్న కోమటిపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గ్రామ సభలో ఎంపీడీఓ పుల్లయ్యతో వాదనకు దిగారు.
ఇందిరమ్మ ఇండ్లు వస్తాయనే ఆశతో పన్నులు కట్టినప్పటికీ అర్హులను గుర్తించకుండా, ఇప్పటికే ఇండ్లు ఉన్నవారినే మళ్లీ ఎంపిక చేశారని వాపోయారు. గుంట భూమి లేని నిరుపేదల పేర్లు వెల్లడించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ పుల్లయ్యతో వాగ్వాదానికి దిగారు. తమ కు న్యాయం చేయాలంటూ పలువురు గ్రామస్తులు అధికారులకు దండం పెట్టి వేడుకున్నారు.