బీసీ బంధు అందరికివ్వాలని గ్రామస్తులు డిమాండ్

భైంసా, వెలుగు :  దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క బీసీ కులస్తుడికి బీసీ బంధు ఇవ్వాలని మహాగాం గ్రామస్తులు డిమాండ్​చేశారు.  గురువారం భైంసా పట్టణంలోని రూరల్​పోలీస్​స్టేషన్​వెళ్లే రోడ్డులో సర్పంచ్​రాకేశ్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. బీఆర్ఎస్​ప్రభుత్వానికి, ఎమ్మెల్యే విఠల్​ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బీసీలోని చాలా కులాల్లోని వారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయన్నారు. కొందరికే బీసీ బంధు ఇవ్వడం సరికాదని, అర్హులైన అందరికీ ఇవ్వాలని డిమాండ్​చేశారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా వెహికల్స్ నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.