
పాల్వంచ, వెలుగు : మండలంలోని పెద్దమ్మతల్లి దేవస్థాన పాలక మండలిలో స్థానికులైన కేశవాపురం, జగ న్నాధపురం వాసులకు అవకాశం కల్పించాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని ఆలయం ఎదుట నిరసన తెలిపారు.
ఆలయ అర్చకులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు కొండం పుల్లయ్య, గంధం నరసింహారావు మాట్లాడుతూ ఆరు దశాబ్దాల కింద భక్త సమాజ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటయిన పెద్దమ్మతల్లి ఆలయంలో తాజాగా స్థానికులకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశా రు. తాజాగా విడుదల చేసిన దేవాలయ పాలక మండలి కమిటీలో స్థానికులకు అవకాశం కల్పించాలని కోరారు.