పల్సి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలి

భైంసా, వెలుగు: ముథోల్​నియోజకవర్గంలోని పల్సి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు డిమాండ్​చేశారు. పల్సి మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భైంసా పట్టణంలో మహా ధర్నా చేపట్టారు. సుమారు 500 మందికి పైగా స్థానికులు కాటన్​ మార్కెట్​ యార్డులో మీటింగ్​ నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా బస్టాండ్​వద్దకు చేరుకున్నారు. 

అన్ని అర్హతలున్న పల్సిని మండలంగా ఏర్పాటు చేయాలని ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. మండలం ఏర్పాటయ్యేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని వెల్లడించారు. అనంతరం ఆర్డీవో ఆఫీస్​కు వెళ్లి వినతి పత్రం అందించారు.