పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్‌వోబీ) నిర్మించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కాల్వ శ్రీరాంపూర్ వెళ్తున్న ఎంపీని కొలనూర్ రైల్వే గేటు వద్ద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి ఐలయ్యయాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి సమస్యను విన్నవించారు. దీంతోపాటు అజ్ని, కాగజ్‌నగర్ ఎక్స్ప్రెస్లతోపాటు కరీంనగర్–తిరుపతి ఎక్స్ప్రెస్ రైళ్లను కొలనూర్‌లో ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అల్లం సతీశ్, ఉనుకొండ శ్రీధర్, శివశంకర్ , రాజు, సాగర్, మల్లయ్య తదితరులుపాల్గొన్నారు.
కాట్నపల్లి వద్ద ఎంపీకి ఘన స్వాగతం
సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ఎంపీ వంశీకృష్ణకు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామం వద్ద కాంగ్రెస్ లీడర్లు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు కల్వల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంపీని పార్టీ కండువాలతో సత్కరించారు. కార్యక్రమంలో లీడర్లు ఎం.మల్లయ్య, రాజయ్య, పి.మల్లయ్య, ఓదెలు పాల్గొన్నారు.