కాగ జ్ నగర్, వెలుగు: బెజ్జూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్కపల్లి (బి )గ్రామంలో మద్యపానం నిషేదానికి గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో గుడుంబా, మద్యం విక్రయించరాదని, తాగరాదని గ్రామ ప్రజలందరూ సమావేశమై తీర్మానం చేశారు. ఈ నిర్ణయాన్ని గౌరవించి వ్యాపారులు, గుడుంబా సహా ఎలాంటి మద్యాన్ని విక్రయించకుండా సహకరించాలని పిలుపునిచ్చారు.
గుడుంబా, మద్యం విచ్చలవిడి అమ్మకాలతో రోగాల బారిన పడి, ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని, దీంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తాము తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని ఎస్ఐ విక్రమ్ కు గ్రామస్తులు వినతిపత్రం
అందజేశారు.