గ్రామస్తుల దాతృత్వం.. నిరుపేద యువతి పెండ్లికి భారీ సాయం

గ్రామస్తుల దాతృత్వం.. నిరుపేద యువతి పెండ్లికి భారీ సాయం

జగిత్యాల రూరల్ వెలుగు: నిరుపేద కుటుంబానికి చెందిన యువతి పెండ్లికి గ్రామస్తులు అండగా నిలిచారు.  జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన ఎడ్ల రమేశ్,- కళ దంపతుల కూతురు మేఘన పెండ్లి ధర్మపురికి చెందిన కొమురయ్యతో బుధవారం జరిగింది. 

గ్రామస్తులు రూ. 2.50 లక్షలు జమ చేసి యువతి పెండ్లిని వైభవంగా జరిపించారు. గ్రామస్తులు చేసిన సాయంపై ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తుల సాయంపై పలువురు 
ప్రశంసించారు.