మాక్లూర్, వెలుగు : ఇండిపెండెన్స్డే సందర్భంగా మండలంలోని మామిడిపల్లిలో ఆర్మీ జవాన్లను గ్రామస్తులు సన్మానించారు. గ్రామం నుంచి 17 మంది యువకులు ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం జవాన్లను పూలమాలలు శాలువాలతో సత్కరించారు. ఇందులో కొందరు రిటైర్ కాగా మరికొందరు డ్యూటీలో ఉన్నారు. సెలవు పై గ్రామానికి విచ్చేసిన నరేశ్, దేవేందర్, ఇటీవల రిటైరైన రాజు, రవీందర్లను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ చింత మల్లారెడ్డి, వీడీసీ కమిటీ, వార్డు మెంబర్లు, గ్రామస్తులున్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో రిటైర్డ్ఆర్మీ ఆఫీసర్స్ కు..
ఆర్మూర్ : బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలో సోమవారం రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ కు సన్మానించారు. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ గుజరాతీ లక్ష్మీనారాయణ, బొమ్మెన రాజేందర్, సాత్పుతే గిర్మాజి నూతన్, బడుగు స్వామి లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ద్యాగ ఉదయ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి, జెస్సు అనిల్ కుమార్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, పాలెపు రాజు, పోల్కం వేణు, కలిగోట ప్రశాంత్ పాల్గొన్నారు.